పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

16 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వరం సర్వే ను వైద్య అధికారులు చేపట్టగా, ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బలిజ పద్మ, మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని అన్నారు. 

ఇండ్లలో ఉన్న నీటి కుండీలు, పాత డ్రమ్ములు, కాళీ కొబ్బరి బోండాలు, వివిధ వాహనాల టైర్లు ఇతర నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో నీరు ఉండకుండా ఖాళీ చేయాలని ఆమె కోరారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపై మురికి కాలువలో వేయకూడదని, చెత్త బండికి అందించాలన్నారు. వర్షాకాలం సందర్భంగా సీజన్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమల నివారణ జరుగుతుందన్నారు. 

వేడి చేసిన నీరును త్రాగాలని ,చల్లని పదార్థాలు తినకూడదని కోరారు. 

జ్వరం సర్వే సందర్భంగా వార్డులోని ఇంటింటా వైద్యాధికారులు సర్వే చేసి జ్వరం ఉన్నవారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి ధనుంజయ్ ,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.

.