తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమావేశంలో (7) అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు.
సమావేశంలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పట్టణములోని లోతట్టు ప్రాంతాల వార్డులలో ఏర్పడిన గుంతలను స్టోన్ డస్ట్ మరియు మొరంతో నింపుటకు అలాగే పట్టణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండుటకు తగు చర్యలు తీసుకోవల్సిందిగా వార్డు సభ్యులందరు కోరినారు.
అనంతరం చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య మాట్లాడుతూ, వర్షాకాలం దృష్టా పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలలో మరియు పట్టణ ప్రజలకు ఏలాంటి ఇబ్బంది కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవలసినదిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించినారు.
ఇట్టి సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మేనేజర్ సి హెచ్. శ్రీనివాస్, టి.పి.ఓ ఎ. ప్రవీణ్ కుమార్, జె.ఎ.ఓ వి. శివకుమార్, టి.పి.యస్. శ్రీమతి రమ్య, ఎ.ఇ. శ్రీమతి జె. లక్ష్మీ,
కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.
.