రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని బిజెపి ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి పత్రం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని కోరుతూ బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. 

పాత పెన్షన్లు 2,000 పెన్షన్ వచ్చే వారికి 4,000 పెన్షన్ ఇవ్వాలని, గృహ జ్యోతి పథకం రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క కుటుంబానికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు వెంటనే నాలుగు వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, అర్హులందరికీ బీడీ, వృదాప్య, వితంతు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. 

కళ్యాణ లక్ష్మీ పథకంలో భాగంగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించాలని, మహిళలకు స్కూటీలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 

కోరుట్ల పట్టణానికి చెందిన దేవదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి అవుతున్న భూములను కాపాడాలని కోరారు. మున్సిపల్ కి సంబంధించిన 10% భూములను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. 

కుమ్మరి కుంట, లక్ష్మణ కుంట, చిలుక చెరువు, తాళ్ళ చెరువు కబ్జాలకు గురి కాకుండా వాటి హద్దులు నిర్మించాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే త్వరలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓ, తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, పార్లమెంట్ కో కన్వీనర్ నీలి గాయత్రి, మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు మడవేని స్వప్న, మహిళ నాయకులు  చెట్టిపెళ్లి మమత, గడ్డం సంధ్య, చిట్యాల లత, అధికార ప్రతినిధిలు పీసరి నర్సయ్య, తిరుమల వాసు, కస్తూరి లక్ష్మినారాయణ, సుధవేణి మహేష్, మున్సిపల్

ప్లోర్ లీడర్ మాడవేని నరేష్, కౌన్సిలర్ పెండెం గణేష్, ప్రధాన కార్యదర్శిలు ఇట్యాల నవీన్, చెట్లపెళ్ళి సాగర్, సీనియర్ నాయకులు మాసం ప్రసాద్, జక్కుల జగదీశ్వర్, చిరుమల్ల ధనుంజయ్, రాచమడుగు శ్రీనివాసరావు, పట్టణ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, కంటం ఉదయ్, అదిపెళ్లి మహేష్, వల్లజి నాగేష్, గుద్దేటి రాజేందర్, చెట్పెళ్లి ఓం ప్రకాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలల సాయి చందు, ఓబీసీ మోర్చ ఉరుమడ్ల చరణ్, తునికీ భాస్కర్, ఆకుల రంజిత్, బెజ్జారపు ఆంజనేయులు, పిసరి అనిల్, గిన్నెల అశోక్, తులసి కృష్ణ, సడిగే మహేష్, బెక్కమ్ అశోక్, దమ్మ సంతోష్, ఆర్మూర్ వినోద్, తహేర్, యాద గౌడ్, చాంద్ పాషా, గోపాల్, దుర్గ ప్రసాద్, గోనెల రాజశేఖర్, గుగ్గిల అశోక్, గుండెటీ సాయి, సంకు రమేష్, బీజేపీ, బిజేవైయం నాయకులు పాల్గొన్నారు.

.