తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల పరిధిలోని జల్లాపల్లి, కారేగాం,హెగ్డోలి,కొల్లూర్ గ్రామాలను ఎంపీడీవో తెలిపిన వివరాల ప్రకారం గ్రామాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇండ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తహసిల్దార్ మల్లయ్య తెలిపారు. మండలంలోని 4 పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని తెలిపారు. పడిపోయిన ఇండ్లలో ఉన్న కుటుంబ సభ్యులకు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఎంపిడిఓ కేఆర్. మనోహర్ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి ఆదేశించారు.
