శిధిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయండి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): వర్షాకాలం కారణంగా కోరుట్ల పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని లేదా మరమ్మత్తులు చేపట్టాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి కోరారు. 

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ మరియు జిల్లా కలెక్టర్ జగిత్యాల ఆదేశానుసారం ప్రజల భద్రత దృశ్య ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీ నుండి శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని లేదా కూల్చి వేసుకోవాలని నోటీసులు జారీ చేయనైనది కావున ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

.