వర్షాలతో పడిపోయిన ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ సునీత

తెలంగాణ ప్రభ (కోటగిరి):కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో  వారం రోజులుగా  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో  పలు గ్రామాలలో నివాసపు ఇండ్లు పడిపోవడం జరిగింది.ఎత్తోండ,కోటగిరి,

కొత్తపల్లి,  గ్రామాలలోని పడిపోయిన ఇండ్లను  తహసీల్దార్ సునీత.   పరిశీలించారు. 8మంది  ఇండ్ల  నివేదిక ఉన్నత అధికారులకు పంపడం జరిగిందని తెలిపారు. తహశీల్దార్  కుటుంబ యజమానులతో మాట్లాడుతూ... సురక్షితంగా ఉన్న ఇండ్లలోకి వెళ్లాలని సూచించారు. ఇండ్లు పడిపోయిన కుటుంబ సభ్యులకు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని గ్రామ పంచాయతీ  కార్యదర్శులకు  ఆదేశించారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ.సయ్యద్, కార్యదర్శులు ఉమాకాంత్, జిపి సిబ్బంది ఉన్నారు.

.