తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ జడ్జ్ రాధిక జస్వాల్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మిషన్ శక్తి 100 రోజుల స్పెషల్ సంయుక్త అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం బద్దెనపల్లి గురుకుల రెసిడెన్షియల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ జడ్జ్ రాధిక జస్వాల్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు ప్రణాళిక సూచనలు, హెల్ప్ లైన్ నెంబర్లు తెలపడం జరిగింది, కౌమార దశలో వస్తున్నటువంటి మార్పులని అర్థం చేసుకుంటూ వాటికనుగుణంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ బాల్యవివాహాలు, బాల కార్మికులు, బాలికల మీద అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు వంటివి జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని, 1098 టోల్ ఫ్రీ నెంబర్స్ ని సంప్రదిస్తే సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతోపాటు తగిన సహాయాన్ని వెంటనే అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా మాట్లాడుతూ సేఫ్ టచ్ అండ్ అన్ సేఫ్ టచ్ మల్లాసి సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్నటువంటి సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పద్మ , DLSA, డిహబ్, సఖి ,బాల రక్ష భవన్ సిబ్బంది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
