రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా పిలుపుమేరకు తహసీల్దార్ కు వినతి పత్రం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలలలోపే కుల గణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 

స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% కి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 

గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించిన రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తామని హామీ మరచి గొల్ల కురుమలను మోసం చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ఏడాదికి 20వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా నిధుల విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఎం.బి. సి. కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్యా కోసం వడ్డీ లేకుండా పూచి కత్తు లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఆరు నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. 

సమయం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి  మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా బిట్లు ఆహ్వానించి 100 కోట్ల రూపాయల వరకు తెరలేపినట్టుగా అర్థమవుతుంది. ముదిరాజ్, గంగాపుత్ర,గౌడ్, మున్నూరు కాపు, పద్మశాలి,విశ్వకర్మ, రజక, సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు గాని కనీసం క్యాబినెట్లు నిర్ణయాలు గాని తీసుకోలేదు.  

పై విషయాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మీకు నిరసన తెలియజేస్తూ తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వారం రోజుల్లో పై విషయాలపైన చర్యలు ప్రారంభించక పోతే లక్ష మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, ఓబీసీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుమడ్ల చరణ్, బిజెపి పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్,కోరుట్ల ఓబిసి పట్టణ అధ్యక్షుడు గండ్ర వెంకటేష్, బిజెపి నాయకుడు జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేష్, సీనియర్ నాయకులు తునికి భాస్కర్, ఆకుల రంజిత్, బిజెపి  మండల అధ్యక్షుడు పంచరి విజయ్, సంకు నరేందర్, కాలాల సాయి చందు మరియు అధిక సంఖ్యలో బిజెపి బీజేవైఎం ఓబీసీ నాయకులు పాల్గొన్నారు

.