బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి : బిజెపి బిసి మోర్చా నాయకులు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బిజెపి ఓబీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల కురుమలకు గొర్లను, గంగపుత్రులకు చేప పిల్లలను పంపిణీ చేసి గౌడ్స్ కు చేనేతలకు విశ్వబ్రాహ్మణులకు ఇతర బీసీలకు దక్కాల్సిన సదుపాయాలను వెంటనే అమలు చేయాలని దుండిగల్ గండి మైసమ్మ మండల ఆఫీస్ ముందు బిజెపి ఓబీసీ మోర్చా నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి కౌన్సిలర్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి, దుండిగల్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, కొంపల్లి అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నరసింహ చారి, సతీష్ సాగర్, చక్రధర్, దూలపల్లి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

.