తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జీడిమెట్ల డివిజన్ విమానపురి కాలనీలో అనిల్ జేమ్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఫోర్స్ 9" సెక్యూరిటీ & కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యాలయాల భద్రత వంటి వాటిలో సెక్యూరిటీ సర్వీసెస్ పాత్ర ఎంతో గొప్పదని మంచి సర్వీసును అందించి ఫోర్స్ నైన్ మంచి పేరును తెచ్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, నాయకులు కుంట వేణు, నార్లకంటి శ్యామ్ సుందర్, బలరాం, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.