కోరుట్లలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 15వ వార్డులో హాజీపూర బస్తి దావఖాన లో "వినాయక లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ " డాక్టర్ ఆడెపు హర్షిత మరియు డాక్టర్ ఆడెపు అనురాగ్ డాక్టర్ల ద్వారా మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఆడెపు కమలమధు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంకు విశేషస్పందన. దాదాపు 300 మంది చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.

మున్ముందు మరిన్ని ఉచిత క్యాంపులు నిర్వహిస్తామని డాక్టర్స్ హర్షిత. అనురాగ్ లు తెలిపారు. 

ఇట్టి కార్యక్రమం లో 15వ వార్డ్ కౌన్సిలర్ ఆడెపు కమలమధు, 2వార్డ్ కౌన్సిలర్ రేష్మా రఫీ మజర్ పాషా, బస్తి దావఖాన డాక్టర్స్ శృతిలయ, స్టాఫ్ నర్సు దీప, మాదవి,ముక్రమ్ బేగ్ మూర్తజా అలీ బేగ్, ఆడెపు ఆనంద్, మరియు వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

.