బాచుపల్లి లో అమ్మ మాట, అంగన్వాడి బాట పాల్గొన్న కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): బాచుపల్లి పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అక్షరాభాష్యం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏండ్ల వయసు నుంచి ఐదేళ్ల పిల్లల వరకు ఆకర్షితులయ్యేలా అంగన్వాడి కేంద్రాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చదువు ఆరోగ్యంతో పాటు పిల్లలకు మానసిక ఉల్లాసానికి నూతన బోధన పద్ధతులతో పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేసే కేంద్రమే అంగన్వాడీ కేంద్రం అని అన్నారు. ఒకవైపు అంగన్వాడి కేంద్రాలను కొత్త విధానంలో తీసుకురావడంతో పాటు వాటి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అదేవిధంగా గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే సేవలు తెలియజేసే కార్యక్రమమే అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చెప్పిందన్నారు. అనంతరం గర్భిణీలకు తల్లులకు పిల్లలకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలను రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొలను కృష్ణారెడ్డి, సీతారాం రెడ్డి, యుద్ధం రెడ్డి, సత్తిరెడ్డి, ఏ శంకర్, కె నారాయణ, బాల్ రెడ్డి, రామచంద్రనాయక్, హరి నాయక్, శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీరారెడ్డి, వెంకటేష్ పటేల్, నవీన్, జీతూ, రాజేందర్, సాయిరాజ్, మురళి, ప్రశాంత్ రెడ్డి, కే లచ్చిరెడ్డి, కే వీరారెడ్డి, జితేందర్ రెడ్డి, పరమేష్, శ్రీనివాస్ గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

.