నా వార్డు ప్రజల ఆశీస్సులతోనే రాజకీయంలో ఉన్నాను : 32 వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ పరిధిలోని 32 వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ తెలంగాణ ప్రభ తో మాట్లాడుతూ నన్ను నమ్మిన నా ప్రజల భవితవ్యం కోసం , వార్డు అభివృద్ధి , ప్రజల అవసరాల కోసం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో చేరాలని సూచించిన నా వార్డు ప్రజల, మిత్రుల, శ్రేయోభిలాషుల సూచనను పరిగణలోకి తీసుకుని మీ సూచనకు అనుగుణంగా శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. అర్హులైన నా వార్డు ప్రజలకు సంక్షేమ పథకాలు త్వరితగతిన చేర్చి, వారి కష్టాలను తీర్చాలంటే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాల్సిందే అనే భావనతో , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తూ.. చా .. తప్పకుండా  నెరవేరుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా నా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించవచ్చనే ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీలో చేరాను.

గత 5 సంవత్సరాల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో మొదటిసారిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన నన్ను మీ అందరూ  అక్కున చేర్చుకొని , దీవించి వార్డు కౌన్సిలర్  గా గెలిపించి,  నాకు ప్రజా సేవ చేసే అదృష్టం కల్పించిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.

ఐదేళ్లలో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిర్విరామ కృషి చేసిన విషయం మీకు తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి .. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని దిగ్విజయంగా అమలు లోకి తెస్తూ .. ప్రజాదరణ చూరగొంటుంది మన రేవంత్ రెడ్డి సర్కార్... ఇలాంటి తరుణంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నా ప్రజలకు సంపూర్ణంగా , త్వరితగతిన అందాలని భావించే నాకు అధికార పార్టీలో ఉంటేనే మరిన్ని సంక్షేమ ఫలాలు నా ప్రజలకు అందించవచ్చనే సదాలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరి, మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మున్సిపల్ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ అన్నారు.

.