కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ధీపా దాస్ మున్షి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల పట్టణ మున్సిపల్ చైర్మన్, మరియు ఆరుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు 

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ బలోపేతం దిశగా కృషి చేస్తున్న జువ్వాడి సోదరులు, కాంగ్రెస్ లో చేరిన కోరుట్ల బల్దియా చైర్మన్, పలువురు కౌన్సిలర్లు 

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు  ఆధ్వర్యంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమర్థ నాయకత్వంలో ఆరు గ్యారంటీల

అమలు, రెండు లక్షల రుణమాఫీ అమలు,పలు విప్లవాత్మక నిర్ణయాలు,తదితర అంశాల ప్రాతిపదికగా మరియు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న స్పందన వల్ల కాంగ్రెస్ కు ఆకర్షితులు అయి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుల నాయకత్వంలో పని చేసేందుకు, కోరుట్ల  పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసేందుకు,ప్రజా ప్రభుత్వ రథసారథి సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనలతో, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ధీపా దాస్ మున్షి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా,జువ్వాడి సోదరుల సమక్షంలో కోరుట్ల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, కోరుట్ల పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్,మరియు ఆరుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు అనగా యాటం పద్మ , సజ్జు భాయ్,గంధం గంగాధర్, బద్ది సుజాత మురళి, జిందం లక్ష్మి నారాయణ,  ఫర్ హాత్ బేగం అబ్దుల్ రహిమ్ లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. వీరి చేరిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్  పార్టీలో తండ్రి,కొడుకులు తప్ప ఎవరూ మిగలలేరని పలువురు స్థానికంగా చర్చించుకుంటున్నారు. రానున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహ భాగం స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

.