ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో హర్షవర్ధన్ కు ఘన సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గణపతి హర్షవర్ధన్ రాజు అండర్ 12 రన్నింగ్ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రం స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ హర్షవర్ధన్ లాంటి విద్యార్థి నేటి యువతరానికి ఆదర్శప్రాయమని, మారుమూల  గ్రామమైన చిట్టాపూర్ నుండి  రాష్ట్రస్థాయి రన్నింగ్  పోటీల్లో పాల్గొని ప్రతిభ  కనపరచడం చాలా సంతోషించదగ్గ  పరిణామమని, రాబోయే రోజుల్లో అత్యుత్తమంగా ఆటలాడి తల్లిదండ్రులకు గ్రామానికి పేరు తేవాలని వారు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్,  రాజేష్ బంటి, షెను భాయ్, విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు

.