జర్నలిస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కు వినతి పత్రం...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ను కలిసి కాలనీలో నెలకొని ఉన్న సమస్యలైన కమ్యూనిటీ హాల్, పార్క్ , ప్లే గ్రౌండ్, చెర్ల ఎల్లమ్మ దేవాలయానికి రోడ్డు ఏర్పాటు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అందులో భాగంగానే ఇప్పటికే జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపట్టామని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత జర్నలిస్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆస్కాని మారుతి సాగర్,  వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర్ల లాలయ్య, కార్యవర్గ సభ్యులు జగదీష్, వెంకట్, లింగస్వామి, సత్యనారాయణ, కృష్ణారావు, శ్రీనివాస్, మారుతి కుమార్, నరేంద్ర చారి, సుధాకర్ రెడ్డి, రాము యాదవ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

.