కాంగ్రెస్ పార్టీలో అందరిని కలుపుకుని పోతా.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కాంగ్రెస్ పార్టీలో అందరిని కలుపుకోని పోతనని, అందరినీ సమానంగా చూసుకుంటాననీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ పలకరింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.పాత, కొత్త అని తేడా లేకుండా అందరం కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు . నియోజకవర్గం అభివృద్ధికి అందరి సహకారం కావాలనీ అన్నారు. కాసుల బాలరాజుకు రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ గా పదవి రావడం పట్ల మనమంతా సంతోషించాలన్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఈ నెల 15న ఎస్.ఎం.బి. బీర్కూర్ రోడ్ ఫంక్షన్ హాల్ బాన్సువాడలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ ,మండల పార్టీ అధ్యక్షులు, పుప్పాల శంకర్, షహీద్ హుస్సేన్, డిసిసి డెలికేట్ సభ్యుడు కొట్టo మనోహర్, నాయకులు గంధం పవన్, ఎజాజ్ ఖాన్, సుంకిని హనుమంతు, కేశ వీరేశం, జెడ్పి కోఆప్షన్ మెంబర్ సిరాజ్, ఎమ్ఏ. హకీమ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
.