పేదలకు అండగా కాంగ్రెస్ : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలానికి వచ్చిన కల్యాణ లక్ష్మి,షాది ముభరక్ చెక్కులను నియోజక వర్గ ఇన్చార్జి కె కె మహేందర్ రెడ్డి తో కలసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలానికి వచ్చిన 178 చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు,సబ్బండ వర్గాల అభ్యున్నతికి సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు,ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు,రైతును రాజును చేయడానికి ఆగష్టు లోపు రెండు లక్షల రుణ మాఫీ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ పెదాల ఇండ్లల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్,పాక్స్ చైర్మన్ లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్,ఎమ్మార్వో వెంకట లక్ష్మీ,మాజీ జెడ్పీటీసీ పూర్మానీ మంజుల లింగారెడ్డి,మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,మండల కాంగ్రెస్ నాయకులు,మండల ల ప్రజలు పాల్గొన్నారు.

.