తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి వాణి ఎరువుల డీలర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ సత్యప్రసాద్ రైతులకు తప్పని సరిగా వారు కొన్న ఎరువులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని తెలిపారు, ఎరువులకు సంబంధించిన లైసెన్స్ అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆయన చెప్పారు,
షాప్ లో మరియు గోదాములో తనిఖీ నిర్వహించి అక్కడ ఉన్న ఎరువుల నిల్వ స్టాక్ బోర్డు లో ఉండాలని తెలిపారు, ఎరువులకు సంబంధించిన ఓ ఫాం, స్టాక్ రిజిస్టరు, లైసెన్స్ అన్ని విధిగా పాటించాలని ఆయన తెలిపారు.
ఎరువులు విక్రయాలు పూర్తి ఆన్లైన్ విధానంలోనే ఈ - పాస్ మిషన్ ద్వారా మాత్రమే నిర్వహించాలని తెలిపారు, ఈ పాస్ లోని నిలువ గోదాములోని నిలువ ఎరువులతో సరిచూసి ఆన్లైన్ విధానంలోనే విక్రయాలు జరపాలని తెలిపారు.
పైన తెలిపిన ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా డీలర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారికి సూచించారు.
మండలంలోని అశోక అగ్రో ఏజెన్సీ లో జరిగిన తనిఖీ లో కలెక్టర్ సత్య ప్రసాద్ తో జిల్లా వ్యవసాయ అధికారి వాణి, మండల వ్యవసాయ అధికారి నాగమణి పాల్గొన్నారు.
.