మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ఆఫీస్ లో ఎక్కువగా వచ్చే ధరఖాస్తులు జీరో కరెంట్ బిల్ కి సంబంధించినవి కావడంతో ధరఖాస్తులను ఇంకా ఎందుకు అప్ డేట్ చేయడం లేదని, ఆన్ లైన్ లో చెక్ చేసి వెంటనే అప్ డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించిందని, అధికారులు సమయపాలన పాటిస్తున్నారా లేదని, మండల ఆఫీస్ లో రికార్డులన్నీ కలెక్టర్ చెక్ చేసి ప్రజల నుండి వచ్చిన ధరఖాస్తులు కానీ, కార్యాలయ పనులను కానీ పెండింగ్ లేకుండా వెంట వెంటనే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సి.ఈ. ఓ. రఘువరన్, ఆర్డీవో శ్రీనివాస్, మండల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

.