నిబంధనలు తుంగలో తొక్కుతున్న అధికారులు : పాకాల శంకర్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల):  జిల్లాలో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ విషయంలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలలో పేర్కొన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల్లో ఇప్పటివరకు 461 మంది బదిలీ అయ్యారని తెలిపారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో క్రమబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం సీనియర్ ఉపాధ్యాయులను రిలీవ్ చేయాల్సి ఉండగా నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. వీర్నపల్లి ,కొనరావుపేట్ ఎల్లారెడ్డిపేట్ ఎంఈఓ జూనియర్లను బదిలీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ రావు  లు తెలిపారు.

.