తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల పరిషత్ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలలో వారు చేసిన పనులను అలాగే వారి యొక్క భావాలను పంచుకున్నారు. పదవి ఉన్నంతవరకే కాదు పదవి లేకున్న, ప్రజలకు మనం సహాయపడాలని అన్నారు. అనంతరం సర్పంచులను, ఎంపీటీసీలను ఎంపీపీ పడిగల మానస రాజు శాలువాలు, మెమొంటోలతో సన్మానించారు.అలాగే ఎంపీపీని ఎంపీటీసీలు సర్పంచులు సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, ఎంపీడీవో కుందారపు లక్ష్మీనారాయణ, ఎంపీ ఓ జోగం రాజు, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్,ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
