మెటుపల్లి అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి పట్టణంలో ఈరోజు మెటుపల్లి -4 అనే అంగన్ వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు, భోజన నమోదులు, టైం టేబుల్, భోజన మెనూ, ఫుడ్, స్టాక్, అంతేకాకుండా అంగన్ వాడిలో ఇచ్చే గుడ్డు నాణ్యత ను స్వయంగా పరిశీలించారు,మరియు స్కూల్ పిల్లల హాజరు, గర్భిణిలు, బాలింతల హాజరు నమోదులు , NHTS మొబైల్ యాప్ లో పరిశీలించారు. 

అంతే కాకుండా అంగన్వాడి కేంద్రములో ఉన్న పిల్లల ,ఎత్తుల ,బరువులు స్వయంగా పరిశీలించారు. NHTS మొబైల్ యాప్ లో , లోప పోషణ ఉన్న పిల్లలు ఎవరు ఉన్నారో యాప్ లో చెక్ చేశారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రాల్లో 

పిల్లల పెరుగుదల పర్యవేక్షణ నివేదికల గురించి అడిగారు.  పిల్లల పెరుగుదల పర్యవేక్షణ ను క్రమంగా చేపట్టి ఖచ్చితమైన పిల్లల  ఎత్తులు, బరువులు నమోదు చేయాలని సర్వే లోని తేడాలు ఉండరాదని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు, మరియు  గ్రామాలలో ,గ్రామ పంచాయితి సిబ్బంది అంగన్ వాడి కేంద్రాలను పర్యవేక్షణా చేపట్టి  ప్రి స్కూల్ పిల్లల విద్య, పెరుగుదల పర్యవేక్షణ చేపట్టి , ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వాణి శ్రీ , RDO, మున్సిపల్ కమిషనర్,MRO ,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

.