మున్సిపాలిటీలో డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలి

అమ్మ ఆధర్శ పాఠశాల పనుల పరిశీలన 

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మున్సిపాలిటీలో డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 

మంగళవారం మెట్ పల్లి మున్సిపాలిటిలో  డ్రైనేజి వ్యవస్థను, ముంపు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.  

డ్రైనేజి వ్యవస్థను శుభ్రంగా ఉంచుటకు ఎప్పటికపుడు శానిటేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండకుండా, ఇండ్లలోకి నీరు వెళ్ళకుండా నీటిని దారి మళ్లించి పెద్ద డ్రైనేజిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. 


ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నూతనంగా జరుగుతున్న నిర్మాణ పనులను నాణ్యమైనవిగా ఉండే విధంగా చూడాలని, అలాగే  పనులను వేగవంతం చేయాలని EE TSEWIDC అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట మెట్ పల్లి ఆర్. డి. ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

.