తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణంలో ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.
జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి తో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరటం జరిగింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ రైతు పక్షపాతి...ముఖ్యమంత్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు
ఆరు గ్యారంటీలు అమలు చేస్తారు అని నమ్మకం ఉంది మరియు ప్రజల పక్ష పాతి.
ముఖ్యమంత్రి,మంత్రులు,సహచరులు అందరి సహకారం ఉంది.
జగిత్యాల పట్టణం లో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం..
డబుల్ బెడ్ రూం ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంత ఆలస్యం అయ్యింది.
ముఖ్యమంత్రి,మంత్రులు సహకారంతో డబుల్ బెడ్ రూం ఇండ్లకు 32 కోట్ల 16 లక్షల నిధుల మంజూరుకు జీవో తీసుకురావడం జరిగింది.
20 వేల మంది బీద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ముఖ్యమంత్రి మంజూరు చేశారు..
నాది రాజ కీయ కుటుంబం..
మా కుటుంబంలో మాకునూరి శ్రీరంగ రావు,మాజీ మంత్రి చొక్కా రావు మాకుటుంబ సభ్యులు..మంత్రులు,ఎమ్మేల్యేలుగా కొనసాగారు.
గతంలో కాంగ్రెస్ అధికారం లో ఉంటే టిడిపికి ఎల్ రమణకు మద్దతు ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ అధికారంలోఉంటే బిఅర్ఎస్ పక్షాన పోటీ చేయటం జరిగింది.
నేను పోటీ చేసే నాటికి బిఅర్ఎస్ లో ఎంపీటీసీ, ZPTC,కౌన్సిలర్ సభ్యులు ఎన్నికలకు అభ్యర్థులు కూడా ఎవరు లేరని ఆయన అన్నారు
మాజీ ఎంపీ కవిత సహకారంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది..
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గురు గుత్తేదారులు వచ్చి వెళ్ళిపోతే...దగ్గరి వ్యక్తిని తీసుకువచ్చి పేద, మధ్యతరగతి ప్రజల కోసం వాటిని పూర్తి చేయటం జరిగింది.
ప్రజా స్వామ్యంలో అధికార పక్ష పార్టీతో పని చేయటం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయటం సాధ్యం అవుతుంది.
బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శ వారి విజ్ఞతకే వదిలేస్తానని ఆయన తెలిపారు
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వారినీ గతంలో బిఅర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించలేధా అని వారిని ప్రశ్నిస్తున్న.
ప్రజా స్వామ్యంలో హుందా తనంతో రాజకీయాలు చేయాలి.
బిఅర్ఎస్ వేదిక పై నన్ను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు
నాపై చేసిన తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నా
నా ఆర్థిక పరిస్తితి గురించి నాకు భయం లేదు..నా ఆర్థిక పరిస్తితి ప్రజలందరికీ తెలుసు..
సేవా భావం తోనే రాజకీయాలకి వచ్చా....
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని ఆయన అన్నారు.
.