తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కిరాణా షాపులలో సరుకులను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు ఈరోజు కోరుట్ల పట్టణంలో ఉన్న కిరాణా దుకాణాల యందు తనిఖీలు నిర్వహించి, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న వారికి మరియు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తినుబండారం షాపులో ఉంచిన వారికి జరిమానాలు విధించడం జరిగింది.
దీనిని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, పర్యావరణానికి సహకరించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా దుకాణదారులు తమ దుకాణాలలో ఉన్న తినుబండారాల ఎక్స్పైరీ డేట్ ను ఎప్పటికప్పుడు చూసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తినుబండారాలను దుకాణం నుండి తొలగించాలి లేని యెడల భారీ జరిమానాలు విధించడమే కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, వార్డు ఆఫీసర్ ప్రసాద్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
.