తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రెండు యాక్సిడెంట్లు జరిగాయి.
ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా , మారుతి సుజీకీ ఇకో వెహికిల్ డ్యామేజీ అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి సమయంలో కామారెడ్డి నుంచి మేడిపెల్లి లోని వెలుగు దినపత్రిక ప్రింటింగ్ ఆఫీస్ కు వెళ్తున్న మారుతి సుజీకీ ఇకో వెహికిల్ మార్గ మాధ్యలోని కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఇన్ గేట్ వద్ద నిజామాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో మారుతి సుజీకీ ఇకో వెహికిల్ డ్యామేజీ కాగా, డ్రైవర్ ప్రశాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి.
అలాగే శుక్రవారం ఉదయం మున్సిపల్ ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో మున్సిపల్ లేబర్ మల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
కాగా బస్టాండ్ ఇన్ గేట్ వద్ద హైవే డివైడర్ల మధ్యలో పెరిగిన చెట్లతో రోడ్డు మీద వాహనాల రాకపోకలు స్పష్టంగా కనిపించక తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రమాదాల నివారణ కు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు, ప్రజలు విన్నవిస్తున్నారు.
