కోరుట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఈరోజు ఉదయం పూట జరిగే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం  జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తిరుపతి  జవాన్లకు, ఆటో డ్రైవర్లకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిరోజు చెత్త సేకరణ మరియు మురికి కాలువలను శుభ్రం చేయడం గురించి పలు సూచనలు చేయడం జరిగింది. 

వర్షాకాలం దృష్ట్యా అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి తెలపడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ పాల్గొనడం జరిగింది.

.