వృద్ధులను పోషించకపోతే చట్టపర చర్యలు : మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): వయోవృద్ధులైన తల్లిదండ్రుల  పోషణ,సంరక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని   మెట్ పల్లి  ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ అన్నారు.

గురువారం  ఆర్డీవో కార్యాలయంలో  తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్  మెట్ పల్లి డివిజన్   శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ,సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ జిల్లా అసోసియేషన్  ముద్రించిన  వయోధికుల  సంక్షేమ,రక్షణ చట్టం 2007 నియమావళి 2011 చట్టం సంక్షిప్త సమాచార  అవగాహన  పత్రికలను  మెట్ పల్లి ఆర్డీవో  ఎన్.శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం       వయోధికుల చట్టం కింద తల్లిదండ్రులు  దాఖలు చేసిన వివిధ   కేసుల్లో వారి కొడుకులు,కోడళ్లను ,అత్త మామలను  విచారించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ   తల్లిదండ్రులైన వయో  వృద్ధులను  పోషించక నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై  తమకి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007  సెక్షన్ 24 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమాన విధించే వీలుందన్నారు. జిల్లాలో వయోధికుల రక్షణ,నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను,  మెట్ పల్లి డివిజన్ పరిధిలో  సేవలను  అందిస్తున్న సీనియర్ సిటీజన్స్ డివిజన్  అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల  కమలాకర్ లను ఆర్డీవో  అభినందించారు.

సీనియర్ సిటిజెన్ల రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ  కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల,మెట్ పల్లి,కోరుట్ల డివిజన్ లో వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా జగిత్యాల జిల్లా నిలిచిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయోవృద్ధుల చట్టం పకడ్బందీగా అమలుకు జిల్లా కలెక్టర్లకు,పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.వయోవృద్ధుల చట్టంలోని అంశాలను వివరించారు. 

ఈ కార్యక్రమంలో  సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ఏ.జి.పి.సురక్ష,,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్, మద్దెనపల్లి స్వామి,డివిజన్, మండలాల ,గ్రామాల సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు,వయోవృద్ధుల నిరాదరణ,వేధింపుల  కేసులకు  సంబంధించిన తల్లిదండ్రులు,కొడుకులు,కోడళ్లు, పాల్గొన్నారు.

.