హైదరాబాద్ లో దండోరా రజతోత్సవాలు విజయవంతం చేయండి...కరపత్రాలు ఆవిష్కరణ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద హైదరాబాదులోని రవీంద్రకళా భారతిలో   టిఎస్ ఎమ్మార్పీఎస్   రాష్ట్ర అధ్యక్షులు  మేడి పాపన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దండోరా రజతోత్సవాలను జులై 7న విజయవంతం చేయాలని ఉమ్మడి మండలాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులవారి ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం  సందర్భంగా రాష్ట్ర కోర్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రకళా భారతిలో  దండోరా రథోత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు  పుట్టినరోజు పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పండుగను ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఉమ్మడి మండలాల నాయకులకు, ఆయా గ్రామాల అధ్యక్షులకు కోరారు. కరపత్రాలు ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్నవారు    జిల్లా ఉపాధ్యక్షులు దేగం సాయిలు, బాన్సువాడ డివిజన్ ఇంచార్జ్ నాగేశం, కోటగిరి, పోతంగల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గోపు సాయిలు, జ్ఞానేశ్వర్, బోర్ర సాయన్న,కన్నం శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.