తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేని పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
గత ప్రభుత్వాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యాశాఖ మంత్రి స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో గంగసాగర్, నితీష్ కుమార్, లవన్, మాసం వినయ్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.