పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గత స్మృతులను నెమరు వేసుకుంటూ అప్పటి గురువులను సన్మానం చేసి మెమొంటో అందించడం జరిగింది. అలాగే మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తంగళ్ళపల్లి గ్రామ వాస్తవ్యులైన ఆర్మీ జవాన్లకు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దేశ సైనికులకు సైతం ఘనంగా సన్మానిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1994-95 బ్యాచ్ తరపున తంగళ్ళపల్లి గ్రామంలో గుర్తుండి పోయే విధంగా సేవా కార్యక్రమాల్లో ముందుంటామని అందరం కలిసి ముందుకు వచ్చి పాఠశాలలో మంచినీటి వసతికి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ, గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లుగా బండి లక్ష్మణ్ గౌడ్, జలగం ప్రవీణ్ (టోనీ), ఇటుకల అశోక్, ముక్క వాసు, రజిత, శారద, నాగరాణి, విష్ణు, పెద్దూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

.