హత్నూరలో చెరువు కుంటలు... కబ్జా నిద్రమత్తులో ఇరిగేషన్... పట్టించుకోని అధికారులు..

తెలంగాణ ప్రభ (నర్సాపూర్):  నియోజకవర్గంలోని మండల కేంద్రమైన హత్నూరలో తాళిము చెరువు హల్వా చెరువు పెద్ద చెరువు శిఖం భూమిని కొందరు వ్యక్తులు వారి స్వార్థం కోసం కబ్జా చేస్తూ కొనసాగిస్తున్నారు వీళ్లు చేసే ఈ పనుల వలన ఆయకట్టు రైతులు ను ఇబ్బందులు పెట్టడంతో  చెరువుకుంటలో నీటి నిల్వ సామగ్నం తగ్గిపోవడం జరుగుతుందని రైతులు వాపోయారు ఈ ప్రభుత్వ శిఖం భూములు అన్యక్రాంతం అవుతున్నాయని రైతులు ఆరోపించారు ఈ సందర్భంగా మత్స్యకారులు రైతులు మాట్లాడుతూ ఈ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ భూములు చూడాలని వారు కోరారు ఈ హత్నూర తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు ఇది ఇలా ఉండగా హత్నూర మండల్ ఇరిగేషన్ ఏఈ గారిని వివరణ కోరగా ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరకరంగా ఉందన్నారు ఈ వినతి పత్రం అందజేతలో దుర్గేశ్వర్ రెడ్డి నరేందర్ ఆంజనేయులు గడ్డమీది కృష్ణ వెంకటేశం గౌడ్ శేఖర్ కృష్ణ కృష్ణ దుర్గేశ్వర్ రెడ్డి నరేందర్ ఆంజనేయులు కృష్ణ వెంకటేశం గౌడ్ శేఖర్ మత్స్యశాఖ కార్మికులు పాల్గొన్నారు

.