కోరుట్లలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని జువ్వాడి భవన్ లో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కత్తిరించి వేడుకల్ని ఘనంగా జరిపారు. 

అనంతరం పట్టణంలోని నిరాశ్రయులకు చిట్ మెల్లి  రంజిత్  గుప్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షులు నయిం, 

 పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  రిజ్వాన్, మేకల నరసయ్య, నజ్జు,  కౌన్సిలర్ ఎం డి అన్వర్,   ఏఆర్ అక్బర్, సోగ్రాభి,   మైనారిటీ సెల్ అధ్యక్షులు రజియుద్దీన్, ఎంబెరి సత్యనారాయణ, తెడ్డు విజయ్ కుమార్,   ఎడ్ల రమేష్, రియాజ్, పోగుల  భూమయ్య, చింత అశోక్, జాగిలం భాస్కర్, చింత రూపలత,  కాశిరెడ్డి,  పోతుగంటి శంకర్, ముల్క ప్రసాద్, చిట్యాల సంతోష్,  జక్కుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

.