తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం లోని శ్రీశ్రీ చిత్తారమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షెడ్ ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. నూతన షెడ్ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తారమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, కుత్బుల్లాపూర్ ప్రజల ఇలవేల్పు అయిన చిత్తారమ్మ తల్లి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్ , కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ , బాలరాజు, ఇంద్రసేనా రెడ్డి, ఇంద్రసేనా గుప్తా, పెంటారెడ్డి, ఆర్. నర్సింహా, జి. నర్సింహా, లక్ష్మణ్, ఆర్. సత్తయ్య, శ్రీరాములు, క్రిష్ణా రెడ్డి, శంకర్ రెడ్డి, ఆర్. యాదగిరి, ప్రభు గౌడ్, శ్రీరాములు, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.