రామోజీరావు మరణానికి సంతాపంగా రేపు చిత్ర పరిశ్రమ బంద్

తెలంగాణ ప్రభ : రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్ కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.

.