తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 34 వ వార్డు లో ఇటీవల గుజ్జ శివ చనిపోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఆదివారం శివ కుటుంబ సభ్యులు మల్లవ్వను పరామర్శించి కుటుంబానికి సానుభూతి తెలిపారు. 50 కేజీలు బియ్యం అందజేశారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.
