బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): నియోజకవర్గంలోని "శ్రీ అంజని మ్యాన్ పవర్ లేబర్ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్" గ్లాస్ కంపెనీ లో గత కొంతకాలంగా కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు కంపెనీ యొక్క యజమాన్యం నిర్లక్ష్యంతో కాంటాక్ట్ కి కార్మికుల ప్రతి నెల వెతనం రాకుండా యజమాన్యం నిర్లక్ష్యం చేసింది.. అయినా కాంటాక్ట్ రావాల్సిన బిల్లు ఇవ్వకుండా అక్కడ చేస్తున్న కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు.. ఆ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు మార్చ్, ఏప్రిల్, మే,మూడు నెలల వేతనం రావాల్సి ఉండగా కాంటాక్ట్ కి బిల్లు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో కాంటాక్ట్ కార్మికులు మీరు ప్రతి నెల మాకు రావాల్సిన వేతనం ఇవ్వకుండా ఆపారని చెప్పి కంపెనీ నుంచి డ్యూటీ మానేయడం జరిగింది... ఆ తర్వాత మూడు నెలల వేత్తనం రావాల్సిన పదిమంది కార్మికులు మనకు ఎవరైతే న్యాయం చేస్తారో అని తోటి కార్మికులతో తెలుసుకొని బి ఆర్ టి యు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ గురించి తెలుసుకొని రవిసింగ్ కార్యాలయం వద్దకు వెళ్లారు ఆ కార్మికులకు జరిగిన అన్యాయం చెప్పారు... వెంటనే స్పందించిన రవి సింగ్ హుటా హుటిన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కాంట్రాక్టుకు రావలసిన మూడు నెలల బిల్లును మరియు కార్మికులవాల్సిన మూడు నెలల వేత్తనం ఇప్పించడం జరిగింది... మొత్తం కలిపి 2 లక్షల 12 వేల రూపాయలు కార్మికులకు ఇప్పించారు.. కార్మికులు మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన రవి సింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు... ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, సుదర్శన్, జగన్, ప్రేమ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..
