యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తిన రామ్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీలను ప్రతి ఒక్క ఓటర్ కు చేరువయేలా యువజన కాంగ్రెస్ మొబైల్ అప్లికేషన్ డోర్ టు డోర్ మొబైల్ ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తిన రామ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మే 13న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నీ చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనే ప్రజలందరికీ శ్రీరామరక్ష అని తెలిపారు. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.
