బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు,  ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేస్తూ శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యాలయంలో దుందిగల్ మున్సిపాలిటీకి చెందిన మల్లంపేట్, భౌరంపేట్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మే 13 పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లలో తీసుకోవలసిన చర్యలను బూత్ ఇన్చార్జులు, ఏజెంట్లకు వివరించారు. అనంతరం గాగిల్లాపూర్, దుండిగల్ గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బహదూర్ పల్లి, డి పోచంపల్లి వార్డు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.