కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఇంచార్జీ కొండూరి గాంధీ బాపు,

కూలీలకు అల్పాహారం, మజ్జిగ, కూల్ డ్రింక్స్ అందజేత

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.  కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఇంచార్జీ  కొండూరి గాంధీ బాపు  కోరారు,

గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం గ్రామం లోని  సింగసముద్రంలో  నాగంపేట, మల్లుపల్లి, గ్రామాల్లో గురువారం  కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఇంచార్జీ  కొండూరి గాంధీ బాపు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు 

కొండూరి గాంధీ బాపు మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసిందని, దళిత బంధు పేరుతో దళిత ప్రజలను మోసం చేశారని తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని స్థలం లేని వారికి కూడా లక్ష రూపాయలతో స్థలం కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపి కూలీలకు అల్పాహారం, మజ్జిగ, కూల్ డ్రింక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నాగంపేట ఎంపిటిసి మెర్గు నాగభూషణం, గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరు సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి పటేల్, రాగుల అంజిరెడ్డి,భూమరాజం,సామలేటి రాజేందర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

.