జనవాసాల్లోకొచ్చిన జాతీయ పక్షి నెమలి

జవ్వాజి కొమురయ్య సామిల్ , విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం  ఏరియా లో సంచరిస్తున్న  ఆడ నెమలి

ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు 

తెలంగాణ ప్రభ(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జవ్వాజీ కోమురయ్య కు చెందిన సామిల్ ఏరియా లో సమీప ఆడవుల  నుంచి తప్పిపోయి వచ్చిన జాతీయ పక్షి  ఆడ నెమలి సంచరిస్తుంది , కొమురయ్య సామిల్ లో పెంచిన చెట్లు దట్టంగా  పెరగడంతో పాటు అక్కడ రెండు మూడు మామిడి చెట్టు, కొన్ని టేకు చెట్లు ఉండడంతోపాటు ప్రక్కనే   ఆడేపు ఆంజనేయులు తన ఇంటి పరిసరాల్లో  పూలమొక్కలు ,నీడ నిచ్చే చెట్టు  , కూరగాయల తోట ఉండడంతో పాటు  విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పరిసరాల్లో దట్టమైన చెట్లు ఉండడం పక్కనే బండారి వెంకటయ్య  పశువుల  కొట్టం  ప్రక్కనే వారి పోలం పెంచుతున్న  మామిడి చెట్లు , అల్లనేరేడు చెట్టు ఉండండముతో  సమీప అడవుల నుంచి తప్పిపోయి  వచ్చిన జాతీయ పక్షి  ఆడ నెమలి కి 

స్థావరంగా మారి  దానికి నీటినీ వసతి  ,ఆకలి తీర్చుకోవడానికి  పచ్చి గడ్డి  పుష్కలమైన వసతులున్నాయి, దీంతో ఈ ఏరియా లో  ఆది సంచరిస్తుంది ,

టీవీల్లో,మొబైల్ ల్లో అడవి జంతువుల  పక్షుల గురించి  చూసి తెలుసుకుంటున్న  జనం ప్రతిరోజు ఈ ప్రాంతంలో  సంచరిస్తూ  ఉదయం సాయంత్రం  అరుస్తున్న నెమలిని  సహాజసిద్దంగా చూడ్డానికి గ్రామస్తులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు ,

.