ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూరు చౌరస్తాలో యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పెప్పర్ స్ప్రే ను సైతం ఎదురుకొని పోరాడిన యోధుడని అన్నారు. ప్రజల మనిషిగా, ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్(టోనీ),జిల్లా ప్రధాన కార్యదర్శులు వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మోర రాజు, సీనియర్ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి,రాపెల్లి ఆనందం, మోర లక్ష్మీరాజం, ఎడ్మల ప్రతాప రెడ్డి, ఆసాని సత్యనారాయణ రెడ్డి, సుద్దాల శ్రీనివాస్,లింగం రాణి, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి పర్షరాములు, అలకుంట దుర్గయ్య, MD హమీద్,గుంజె గోపాల్, కుర్మయ్య,శ్రీనివాస్, వెంకటేష్, కిట్టు, కుమార్, శేఖర్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.