తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ 8 బూత్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలపై ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు సమస్యలను తెలుసుకొని ఎలాంటి సమస్యలు ఉన్న ఎన్నికల అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని సోషల్ మీడియా కన్వీనర్ అభిషేక్ గ్రామస్తులకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున గ్రామంలోని సమస్యలను సకాలంలో పరిష్కారం చేస్తూ గ్రామ ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ... చేతు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పథకాలను ఉపాధిహామీ కూలీలకు క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
