కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండులో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు చే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు  పిలుపునిచ్చారు,

          ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు  మాట్లాడుతూ  ఈ రోడ్ షో కార్యక్రమానికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆదర్శ్ శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కు ఎన్నికల జిల్లా కన్వీనర్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొనే ఈ రోడ్ షో కార్యక్రమానికి జనాన్ని పెద్ద ఎత్తున తరలించాలని వారు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు,

         తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును అత్యధిక మెజార్టీతో ప్రజలు దీవించి గెలిపించాలని వారు ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, 

          పలు అభివృద్ధి సంక్షేమ విషయంలో అవినీతికి పాల్పడిన బిఆర్ఎస్ పార్టీని మతతత్వ పార్టీ అయినా బిజెపి పార్టీని ఓడించి ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు 

       ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి , మర్రి శ్రీనివాస్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి , పందిళ్ళ లింగం గౌడు , మాజీ తాజా సర్పంచ్ నేవూ వెంకట్రెడ్డి,   పట్టణ శాఖ అధ్యక్షులు చెన్ని బాబు,  కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు  గుండాడి  రాంరెడ్డి,  యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భానోతు రాజు నాయక్,  వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు వివిధ  హోదాలలో పనిచేసే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

.