పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్న జగద్గిరిగుట్ట పోలీసులు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీ లో గురువారం ఉదయం కాలనీ లోని పార్క్ వద్ద ఒక యువకుడు పార్క్ కు వచ్చే ఒక మహిళా పట్ల అసభ్యం గా ప్రవర్తించడంతో ఇది గమనించిన స్థానికులు ఆకాతాయి ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆ యువకున్ని స్తంబానికి కట్టి వేసి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది సకాలం లో చేరుకొని మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకాతాయి ని పెట్రోలింగ్ వాహనం లో పోలిస్ స్టేషన్ కు తరలించారు.సకాలంలో వెంటనే స్పందించిన కాలనీ యువకులను పోలీసు లు అభినందించారు.కాలనీ లలో అనుమానస్పదం గా ఎవరైనా తిరుగుతూ కనిపిస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకున్ని పట్టుకున్న వెంటనే పోలీసు లకు సమాచారం ఇవ్వడం తో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే చేరుకొని,ఆకాతాయిని అదుపులోకి తీసుకోవడంతో స్థానికులు పోలీసులను అభినందించారు.
