అభయాహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మేడే దినోత్సవం పురస్కరించుకొని అభయహస్తం ఫౌండేషన్ నిర్వాహకులు బర్ల మధు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ... కార్మికులు గ్రామాలలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటనికి కీలక పాత్ర పోషిస్తూ వారి వృత్తిని సక్రమంగా నిర్వహిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. మే డే సందర్భంగా వారికి తన వంతుగా సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్ మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు జిల్లా మైనార్టీ కార్యదర్శి వాహిద్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ పారిశుద్ధ కార్మిక తదితరులు పాల్గొన్నారు.
