జిపి యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ మండల యూనియన్ అధ్యక్షురాలు వాగ్మారి రాజేశ్వరి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్మికుల హక్కుల పోరాటానికై కృషి చేస్తానని పేర్కొన్నారు. నేడు యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నందుకు పారిశుద్ధ్య కార్మికులకు గ్రామపంచాయతీ కారోబార్లకు  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియూ సహాయ కార్యదర్శి నన్నే సాబ్,  శేఖర్ రజిని సందీప్ జాకీర్ హుస్సేన్ సాయ గౌడ్ శంకర్ వసరం  జబీర్ సావిత్రి సాయవ్వ లలిత మాధవి బ్రహ్మం పోశెట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

.