ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 పెంపు
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిచండి
తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ పార్లమెంట్గ్ అభ్యర్థి శ్రీ వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం గ్రామాల్లో ఉన్న ప్రజలను, ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థిచారు. ఈ సందర్బంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆరోజు ప్రచారంలో చెప్పి ఈరోజు అమలు చేస్తున్నాం ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గా కవ్వంపల్లి సత్యనారాయణ,గెలుపొందిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నాయకత్వంలో ఆరు గ్యారెంటీలో భాగంగా 5 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. ఎన్నికలు కోడ్ తరువాత మరో గ్యారంటీ అయినా 2లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుంధన్నారు. సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా 5న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతుగా ధర,ఉపాధి కూలీలకు రోజుకు 400 పెంపు,ప్రతి పేద కుటుంబ మహిళలకు ఏటా లక్ష రూపాయలు,ఆరోగ్య భీమా 25 లక్షలు,యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీ లు అమలు చేయడం జరుగుతుందన్నారు. బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కటింగ్ చేసి రైతులను మోసం చేసిన ఘనత టీ ఆర్ఎస్ ప్రభుత్వంకదా అని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు చేతు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, జిల్లా నాయకులు ఒగ్గు రమేష్, కర్ణాకర్ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కేశవేణి రాజేశం,మైనార్టీ అధ్యక్షులు జమాల్, జెట్టి మల్లేశం, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజు సంతోష్, బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్,అనిల్,కేశవ్, సంపత్ రెడ్డి, రవి, సుదగోని వెంకటేష్ గౌడ్, బాబు, కోత్తపల్లి బాబు, తిరుపతి రెడ్డి, నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి,అంజయ్య, కానుకయ్య, విజయ్, మనిదీప్, మల్లయ్య,మంజూరి అలీ, శ్రీను,మహిళా అధ్యక్షురాలు సత్యవతి, జ్యోతి, సరిత తదితరులు పాల్గొన్నారు.
