లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని సిసి అధికారులకు వినతి పత్రం అందజేసిన మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చండి. త్రీఫెజ్ విద్యుత్ సౌకర్యం కల్పించండి.ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి లో నెలకొన్న లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ అధికారులకు సోమవారం రోజు వినతి పత్రం అందజేశారు.ఇటీవల కిష్టం పల్లి లో లో ఓల్టేజ్ విద్యుత్ సరఫరా  కావడంతో టివిలు, ఫ్రిడ్జ్ లు కూలర్ లు కాలిపోయాయని దీంతో వారికి ఆస్తి నష్టం జరిగిందని బాలరాజు యాదవ్ వినతి పత్రం లో పేర్కొన్నారు.లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించి ఇక్కడి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

.